శ్రీ నాంపల్లి బాబా వారు రంజాన్ పండగ రోజు చేసిన అద్భుతమైన లీల

ramjan festival
Share with World

శ్రీ నాంపల్లి బాబా వారు రంజాన్ పండగ రోజు చేసిన అద్భుతమైన లీల

శ్రీ నాంపల్లి బాబా వారి అద్భుత మైన లీలలు అనేకము, అందులో ఈ రోజు రంజాన్ పండుగ రోజు చేసిన ఒక లీల గురించి వివరిస్తాము.

దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర

నవంబర్ 23, 2003 లో శ్రీ నాంపల్లి బాబా వారి సన్నిధిలో శ్రీ అజయ్ బాబు గారు వాళ్ళ అమ్మ గారు తులసమ్మ, అనసూయమ్మ, కుమార స్వామి, సిమ్మి, సర్కార్, సీతక్క అందరము కలిసి రంజాన్ పండగ ఆనందంగా జరుపుకుంటున్నాం. భక్తుల కోసమని 30 మందికి సేమియా తయారు చేసాము.

ఆ రోజు నాంపల్లి బాబా వారు ఉదయం 09 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా కోపంగా ఉన్నారు. ఇంతలో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జగ్గంపేట మరియు ఇతర గ్రామాల నుండి సుమారు 80 మంది భక్తులు కలిసి, శ్రద్ధతో శ్రీ గురు చరిత్ర పారాయణ చేసి షిర్డీ వెళ్లి శ్రీ సాయి బాబా వారి దర్శనం చేసుకొని, హైదరాబాద్ వివేకానందనగర్ కాలనీలో అజయ్ బాబు గారి బిల్డింగ్ లో ఉంటున్న శ్రీ నాంపల్లి బాబా వారి దర్శనార్ధం వచ్చారు.

అప్పుడు నాంపల్లి బాబా వారు చాలా ఆనందంగా వారు వచ్చిన వెంటనే తన ఎడమ కాలు క్రింది పెట్టి ప్రతి ఒక్కరిని పిలిచి తల మీద చేయి పెట్టి అందర్నీ ఆశీర్వదించారు. శ్రీ నాంపల్లి బాబా వారు ఈ లోకంలో అవతరించిన తరువాత ఎప్పుడు ఈ విధంగా చేయలేదు. భక్తులు ఆనందంతో బాబా వారి ఆశీస్సులు తీసుకున్నారు.

అప్పుడు అందరికి 100 గ్రాముల గ్లాసులో సేమియా ఇచ్చాము. 30 మందికి తయారు చేసిన సేమియా సుమారు 101 మందికి పైగా వచ్చింది. 


Share with World

2 thoughts on “శ్రీ నాంపల్లి బాబా వారు రంజాన్ పండగ రోజు చేసిన అద్భుతమైన లీల”

  1. This is proof that baba is dattavatara
    Dattavatara always does this miracle where food is prepared for some people
    But served for hundreds
    Jai dattavatara Shri Nampally Baba.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *