Home

మహా అవధూత శ్రీనాంపల్లి బాబా మహారాజ్ ప్రప్రధమంగా హైదరాబాద్ నగరం నందలి మలక్ పేట స్మశాన వాటికలో 1950 ప్రాంతంలో ప్రకటము అయ్యారు. ఎవరీ నాంపల్లి బాబా? ఎక్కడి వారు? వీరి పూర్వ వృత్తాంతం ఏమిటి? ఇన్ని ప్రశ్నలకు ఎవరి వద్దను, విధమైన సమాధానములు గత ఆరున్నర దశాబ్దాలు నుండి లభింపకున్నవి

మహా అవధూత అంతిమముగా 2004  సంవత్సరం నవంబర్ 6 తేదీన తన భౌతిక శరీరాన్ని వీడిరి. మహా అవధూత దత్తాత్రేయుల వారి ఆరవ అవతారన్నని, వారి భక్తులలో ఒకరైన శ్రీ జయ ప్రకాష్ గారికి తెలియజేయడం జరిగింది. దత్తాత్రేయుల వారి పూర్వ అవతారములు విధముగానున్నవి.

  • శ్రీ పాద శ్రీ వల్లభులు

  • శ్రీ నృసింహ సరస్వతీ స్వామి

  • శ్రీ అక్కల్కోట మహారాజ్

  • శ్రీ మాణిక్య ప్రభు

  • శ్రీ శిరిడీ సాయిబాబా

 

బాబా వారు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, ఆయన ఒక మౌన ముని. వారిలో వారు సంభాషించుకునేవారు, నవ్వుకునేవారు, ఆకాశం వైపు తదేక దీక్షతో వీక్షించేవారు. ఏవో సైగలు చేసేవారు. వాటి వాళ్ళ ఆయన ఒక మతి స్థిమితం లేని వ్యక్తిగా ప్రజలు భావించేవారు.

అతి కొద్ది మంది దివ్య అనుభవం పొందిన సత్పురుషులు మాత్రం వీరిని అవధూతగా గ్రహించి కొలిచేవారు. అందులో విచిత్రం ఏమిటంటే బాబాగారు అత్యంత అరుదుగా స్నానం చేసేవారైనప్పటికీ ఆయన భౌతిక దేహం నుండి సుఘంద పరిమళాలు ప్రసారం అయ్యేవి.

1972 ప్రాంతములో బాబా వారు రోడ్డు ప్రమాదానికి గురిఅయి కుడికాలు పోగుట్టుకోవడం,
1980
ప్రాంతము వరకు ఎవరికీ కనపించకపోవటం జరిగింది.
1980
లో బాబా వారు నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఎదురుగా ఉన్న పోలీస్ స్టేషన్ వరండాలో ప్రత్యక్షమయ్యారు. ఆనాటి నుండి బాబా వారిని అందరు నాంపల్లి బాబా అని పిలిచేవారు.
1980
నుండి 1987 వరకు అన్ని వర్గాల వారు అనగా మంత్రులు, డాక్టర్లు, ఉన్నతాధికారులు,తదితరాలు అందరూ కూడా బాబా వారిని దర్శించి వారి దివ్య ఆశీస్సులను పొందేవారు.
1987
ప్రాంతంలో శ్రీ శ్రావణ్ కుమార్ గారు చార్మినార్ దగ్గర ఉన్న గౌలిపుర లోని వారి ఇంటికి బాబా గారిని తీసుకువెళ్లారు.

2003 లో బాబా గారు గౌలిపుర నుండి కూకట్ పల్లి వివేకానంద నగర్ కాలనీ లో శ్రీ తుమ్మల అజయ్ బాబు గారి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న భవనంలో, మూడవ అంతస్తులోకి రావడం జరిగింది. శ్రీ తుమ్మల అజయ్ బాబు గారు ప్రస్తుతం శ్రీ నాంపల్లి బాబా గారి సంస్థానానికి యాజమాన్య ధర్మకర్తగా ఉన్నారు.

మహా అవధూత శ్రీ నాంపల్లి బాబా వారు 06-11-2004 భౌతిక దేహాన్ని చాలించారు. వారి భౌతిక కాయం ప్రస్తుతం ఉన్న శ్రీ నాంపల్లి బాబా సమాధి మందిరములో  నిక్షిప్తం చేయబడింది. శిరిడీ సాయి బాబాను దర్శించడానికి శిరిడీ వెళ్లిన  అనేకమంది  భక్తులతో  శ్రీ శిరిడీ సాయి బాబా ఇలా చెప్పడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న శ్రీ నాంపల్లి బాబా రూపంలో కూడా నేనే ఉన్నాను, మీరు నన్ను నాంపల్లి బాబా రూపంలో హైదరాబాద్ లోనే దర్శించగలరు. తదనుగుణంగా శిరిడీ దర్శించి వచ్చే భక్తులు అనేకమంది వారి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ లో దిగి నాంపల్లి బాబాను దర్శించి వారి దివ్య ఆశీస్సులను పొందేవారు.

షిరిడి లో 50 సంవత్సరాలు పాటు సాయి బాబా సేవ చేసుకున్న శ్రీ శివనేశన్ స్వామి కూడా ఇదే విషయాన్నీ ధృవీకరించారు. శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారే బాబాను లోకానికి ప్రకటం చేసినట్టు ప్రతీతిఎందరో మహానుభావులు, ఉదాహరణకు శ్రీ గోపాల్ బాబా (పిఠాపురం), శ్రీ రామిరెడ్డి తాత, శ్రీ కోటి బాబా, శ్రీ దిగంబర బాబా లాంటి వారు మహావధూత శ్రీ నాంపల్లి బాబా వారిని తరచూ దర్శించుకొని వారి దివ్య ఆశీస్సులు పొందేవారు.
వీరి మహాత్యములు అనేకముగా ఉండేవి. వీరి గురించి మరిన్ని వివరాలతో కూడిన సంకలన గ్రంధము శ్రీ శ్రీ శ్రీ నాంపల్లి బాబా దివ్య చరితమును భక్తులు శ్రీ ధర్మపురి క్షేత్రం లోని శ్రీ నాంపల్లి బాబా సంస్థానం లో పొందగలరుదీని రచయత శ్రీ సత్యనారాయణ బాపూజీ గారు, వీరు ఆధ్యాత్మిక వేత్త మరియు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారి అనుయాయులు.

Note:

Each and every Rupee received as donation shall be accounted for and utilized for the purpose of development of the temple, and maintenance of day to day expenses in the temple. (“బాబా గారి పేరు మీద సంస్థానముకు జమచేయబడిన ప్రతి పైసా కూడా దేవాలయ అభివృద్ధికి, బాబా సేవల నిమిత్తము మాత్రమే వినియోగించి లెక్క వ్రాయబడును. భక్తులకు విధమైన సందేహములు అవసరం లేదు“)

మహా అవధూత శ్రీ దత్తాత్రేయుల వారి ఆరవ అవతారమైనటువంటి శ్రీ శ్రీ శ్రీ నాంపల్లి బాబా వారి దివ్య ఆశీస్సులు భక్త కోటిఫై సదా వర్షించాలని అభిలాషిస్తూ..

శ్రీ శ్రీ శ్రీ నాంపల్లి బాబా సంస్థానం