సమర్థ సద్గురు శ్రీ నాంపల్లి బాబా వారి ఏకాదశ సూత్రాలు:
దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర
-
నీవు జ్ఞానం, ఆత్మనిగ్రహం మరియు పవిత్రతలతో నిండిపోవాలి.
-
పవిత్రమైన గ్రంధాలు లోతుగా అధ్యయనము చేయాలి.
-
ధర్మశాస్త్రాలు, గురువులు వారి సంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
-
అజ్ఞానంతోను , ఆవేశంతోనూ ధర్మప్రచారం చేసేవారికి దూరంగా ఉండాలి.
-
నీవు ఎప్పుడు దైవ ప్రార్ధన సామూహికంగానే చేయాలి గాని వాటికి నాయకత్వం వహించరాదు.
-
కీర్తిని ఆశించవద్దు, అందులో ఎంతో ప్రమాదం ఉంది.
-
ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
-
రాజులను, యువరాజులును కలుసుకోవటానికి వెళ్ళవద్దు.
-
నీవు ఆశ్రమం కట్టవద్దు, అందులో జీవించవద్దు.
-
సంకీర్తన, నృత్యములలో అతిగా నిమఘ్నుడవవద్దు. అది ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో హానికరం.
-
తక్కువగా మాట్లాడు, తక్కువగా తిను, తక్కువగా నిద్రించు.
Jai nampally baba